బంగారం కొనుగోలు దారులకు శుభవార్త..

134
gold

బంగారం కొనుగోలు దారులకు శుభవార్త..రోజురోజుకు బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ ఒక్కరోజే 22 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.950 తగ్గి ప్రస్తుతం రూ.42,100 ఉంది. అలాగే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం(ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,930 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.1,040 తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.1300 తగ్గి రూ.72000కు చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారంపై పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్న కారణంగా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి.