భారతీయులకు గుడ్ న్యూస్..

22
- Advertisement -

భారతీయులకు గుడ్ న్యూస్ అందించింది దుబాయ్. వీసా విధానంలో మార్పులు చేపట్టిన దుబా్ ఐదేళ్ల మల్టిపుల్‌ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టింది. ఈ వీసా పొందినవారు మూడు నెలల పాటు దుబాయ్‌లో ఉండొచ్చు. దీనిని మరో 90 రోజులపాటు పొడిగించుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఏడాదిలో ఆరు నెలలకు మించకుండా దుబాయ్‌లో ఉండేందుకు ఈ కొత్త వీసా విధానంను తీసుకొచ్చింది దుబాయ్. వ్యాపారం, వినోదాత్మక పర్యటనల కోసం ఈ వీసాను ఉపయోగించుకోవచ్చునని తెలిపింది.

దుబాయ్‌కు వచ్చే టూరిజం పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు ఇది దోహద పడుతుందని ఆ దేశ అధికారులు తెలిపారు. ఇక దుబాయ్ వెళ్తున్న పర్యాటకుల్లో అత్యధికులు భారతీయులే కావడం విశేషం.

Also Read:కంటోన్మెంట్ ఎమ్మెల్యే మృతి..కేసీఆర్ సంతాపం

- Advertisement -