కరోనా నుండి కోలుకున్నారు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా , ఆమె భర్త నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి. ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయిన వారు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజలకు అండగా నిలిచి, అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి నిత్యం ప్రజలతో గడిపామన్నారు.
తమవంతు సహకారంగా ఊరూరా నిత్యావసర సరుకులు, బియ్యం, మాస్కులు, శానిటైజర్లు అందించామని…విపత్కార పరిస్థితిలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఆగకూడదని ఆ దిశగా అడుగులు వేశామన్నారు. ఈ క్రమంలోనే దంపతులిద్దరం కరోనా బారినపడ్డామన్నారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని ఆశీస్సులు, ఆలేరు నియోజకవర్గ టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ముఖ్యంగా ప్రజల పూజలు, దీవెనలతో కరోనాను జయించి ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యామని తెలిపారు. ఆపత్కాలంలో మా పై మీరు చూపిన వాత్సల్యం ఎంతో ఆత్మ స్థయిర్యాన్ని నింపింది.. ఆలేరు ప్రజలకు రుణపడి ఉంటాం అన్నారు. మాస్కులు ధరిద్దాం.. భౌతిక దూరం పాటిద్దాం.. నిర్లక్ష్యం వీడి.. ఆనందంగా జీవిద్దాం అని పిలుపునిచ్చారు.