- Advertisement -
అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో తెలుగమ్మాయి గొంగడి త్రిష చరిత్ర సృష్టించింది. ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో 59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్లు సాయంతో 110 పరుగులతో అజేయంగా నిలిచింది.
త్రిషతో పాటు మరో ఓపెనర్ కమలిని (51; 42 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయగా వన్‌డౌన్ బ్యాటర్ సనికా ఛల్కే (29; 20 బంతుల్లో 5 ఫోర్లు) రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు సాధించింది. త్రిష స్వస్థలం భద్రాచలం.
Also Read:సింగర్ భోస్లేతో డేటింగ్‌పై సిరాజ్!
- Advertisement -