కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం:గోనె ప్రకాశ్‌ రావు

23
- Advertisement -

కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం జరుగోందన్నారు గోనే ప్రకాశ్ రావు. సీట్ల కేటాయింపుపై నిజ నిర్ధారణ కమిటీ వేసి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌కి ఆయన లేఖ రాశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే బడుగు, బలహీన వర్గాల నుంచి సీఎం అభ్యర్థిని ప్రకటించాలని అందులో కోరారు.

పారాచుట్‌ నేతలకు స్థానం కల్పించారని విమర్శించారు. పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్న వారికి అన్యాయం జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండాలని సూచించారు. అనేక సార్లు ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావుకు కాంగ్రెస్ సీటు ఇస్తున్నదని విమర్శించారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గెలవలేక పోయారని, కాంగ్రెస్‌ తరఫున ఎలా విజయం సాధిస్తారని ప్రశ్నించారు.

Also Read:టైగర్ నాగేశ్వరరావు..ట్విట్టర్ రివ్యూ

- Advertisement -