స్విమ్మర్ శ్యామలను అభినందించిన ఎమ్మెల్సీ కవిత..

84

ప్రముఖ స్విమ్మర్ గోలి శ్యామలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. శ్యామల గోలి సెప్టెంబర్ 29న యూఎస్ఏ లోని కాటలినా ఐలాండ్ నుండి లాస్ ఏంజెల్స్ లోని మెయిన్ లాండ్ మధ్య గల జలసంధిని ఈది రికార్డు సృష్టించారు. మంగళవారం గోలి శ్యామల ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్ లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు.

32 కిలోమీటర్లు గల ఈ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళగా శ్యామల నిలవడం సంతోషకరమన్నారు ఎమ్మెల్సీ కవిత. గోలి శ్యామల గతంలో భారత్ – శ్రీలంకల మధ్యనున్న 30 మైళ్ల పాక్ జలసంధిని (Palk Strait ) ఈదిన ప్రపంచ రెండవ మహిళగా రికార్డు సాధించారు. మధ్య తరగతికి చెందిన తనను ఎమ్మెల్సీ కవిత ఎంతగానో ప్రోత్సహించారని గోలి శ్యామల తెలిపారు.