రజనీకాంత్‌కు యూఏఈ గోల్డెన్‌ వీసా..

14
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక యూఏఈ నుంచి గోల్డెన్‌ వీసా అందుకున్నారు. యూఏఈ గోల్డెన్‌ వీసా పొందడం గౌరవంగా భావిస్తున్నానని…యూఏఈ ప్రభుత్వానికి రజనీకాంత్‌ కృతజ్ఞతలు తెలిపారు. దీంతో రజనీ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది. ఈ వీసా పొందిన వారు ఎలాంటి ఆంక్షలు లేకుండా యూఏఈలో దీర్ఘకాలికంగా నివ‌సించే వీలు ఉంటుంది. 2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలు మంజూరు చేయ‌డం మొద‌లైందితొలుత షారుఖ్ ఖాన్ అ వీసాను అందుకోగా ఆ త‌ర్వాత బాలీవుడ్ న‌టులు సంజ‌య్ ద‌త్‌, సునీల్ శెట్టి, మౌనీ రాయ్‌, ఫ‌రా ఖాన్‌, బోనీ క‌పూర్ ఫ్యామిలీ , నేహా క‌క్కర్‌, సింగ‌ర్ సోనూ నిగ‌మ్ ఈ వీసాను పొందారు.

Also Read:వచ్చే ఏడాది ఐపీఎల్లో ధోని!

- Advertisement -