భారీగా పెరిగిన బంగారం ధరలు..

112
- Advertisement -

పిసిడి ప్రియులకు షాక్‌ తగిలింది.. వరుసగా మూడు రోజులు తగ్గిన పసిడి ధరలు.. తాజాగా మళ్లీ పెరిగాయి. గడిచిన 10 రోజుల్లో బంగారం ధరలు నాలుగు తగ్గాయి. మరో నాలుగుసార్లు పెరిగాయి. రెండు రోజులు స్థిరంగా ఉన్నాయి. పసిడి ధరలు నిత్యం మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, జువెలరీ మార్కెట్లలో నగలకు డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు దేశరాజధాని న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, కేరళలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. ఇక్కడ 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,450గా ఉంది. చెన్నైలో రూ.48,140, పుణెలో రూ.47,480 జైపూర్‌,లక్నోల్లో రూ.47,600కి తగ్గిపోయింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, కేరళలో ఒకే ధరకు 24 క్యారట్ల స్వచ్ఛమైన బంగారం లభిస్తోంది. ఈ ప్రాంతాల్లో తులం 24 క్యారట్ల బంగారం ధర రూ.51,760కి లభిస్తోంది. చెన్నైలో రూ.52,510, పుణెలో రూ.51,790, జైపూర్‌, లక్నోల్లో రూ.51,790కి పెరిగింది. ఇక బంగారంతో పాటు వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండి రూ.72,900కి లభ్యమవుతోంది.

- Advertisement -