భారీగా పెరిగిన బంగారం ధర..

277
gold rate
- Advertisement -

బంగారం ధర భగభగమంటోంది. ఆల్ టైమ్‌ గరిష్టానికి బంగారం ధర చేరుకుంది. బంగారం బాటలోనే వెండి కూడా దూసుకెళ్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల పరిస్థితులు సహా దేశీ మార్కెట్‌లో రూపాయి పతనం కావడం, కరోనా వైరస్ భయాలు వంటి అంశాలు కారణంగా బంగారం ధర పెరిగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,020 పెరుగుదలతో రూ.46,160కు చేరగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.950 పెరుగుదలతో రూ.42,310కు చేరింది.పసిడి ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.1230 పెరిగి రూ.51,080కు చేరింది.

ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి పెరుగుదలపై ప్రభావం చూపాయి.

- Advertisement -