బాలయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం..

152
kcr
- Advertisement -

బాతిక్ చిత్ర కళాకారుడు యాసల బాలయ్య(82) మృతి ప‌ట్ల‌ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాతిక్ చిత్ర కళ ద్వారా పల్లె జీవన సౌందర్యాన్ని కళ్ళకు కట్టారని… బాలయ్య మరణం చిత్రకళారంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలు, గ్రామీణ జానపద చిత్రాలను తన కుంచెతో ఆవిష్కరించిన బాతిక్‌ బ్రహ్మ యాసాల బాలయ్య మృతిచెందాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

- Advertisement -