- Advertisement -
బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్. ఇవాళ ఉదయం 11 గంటల నాటికి పసిడి ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.450 తగ్గి రూ.80,250గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం మాత్రం కాస్త పెరిగింది. రూ.60 పెరిగి తులం బంగారం ధర రూ.88,100గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధరలు ఇంతే ఉన్నాయి.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.550 తగ్గి రూ.80,300గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.640 తగ్గి రూ.87,550గా ఉంది. దేశంలో వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.100 చొప్పున తగ్గింది.
హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,07,900గా ఉండగా విజయవాడలో కేజీ వెండి ధర రూ.1,07,900గా ఉంది. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.1,00,400గా ఉండగా ముంబైలో కేజీ వెండి ధర రూ.1,00,400గా ఉంది.
Also Read:హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
- Advertisement -