భారీగా పడిపోయిన బంగారం ధర..

378
gold rate
- Advertisement -

కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర దిగివచ్చింది. వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టగా వెండి కూడా పసిడి బాటలోనే నడిచింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.340 తగ్గి రూ.38,720 నుంచి రూ.38,380కు దిగొచ్చింది.

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.340 తగ్గుదలతో రూ.42,240 నుంచి రూ.41,900కు క్షీణించింది. ఇక వెండి కూడా రూ. 400 తగ్గి రూ.49,600 నుంచి రూ.49,200కి చేరింది.

పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో పాటు అమెరికా సానుకూల ఆర్థిక గణాంకాల నేపథ్యంలో డాలర్ బలపడింది. దీంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడింది. అంతేకాకుండా దేశీ మార్కెట్‌లోనూ రూపాయి రికవరీ బాట పట్టడంతో పసిడి ధర దిగొచ్చింది.

- Advertisement -