హైదరాబాద్‌కు హైస్పీడ్‌ రైల్వే కారిడార్‌..

445
high speed rail
- Advertisement -

దేశంలో 6 హైస్పీడ్ రైల్వే కారిడార్లను భారతీయ రైల్వే అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా కొత్తగా 6 కారిడార్లను ఏర్పాటు చేయనుండగా జాబితాలో ముంబై – హైదరాబాద్ మార్గం ఉంది.

ముంబై – అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును తొలి హైస్పీడ్‌ కారిడార్‌‌గా గుర్తించగా ముంబై – పుణె – హైదరాబాద్‌ రూటు కూడా ఉంది. 711 కి.మీ. పొడవైన ఈ మార్గాన్ని స్పీడ్ కారిడార్‌గా అభివృద్ధి చేయనున్నారు.

హైస్పీడ్‌ కారిడార్‌లో రైలు వేగం గంటకు 300 కి.మీ. కాగా.. సెమీ హై స్పీడ్‌ కారిడార్‌లో రైలు వేగం గంటకు 160 కి.మీ వేగం కాగా వీటికి సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌)ను ఏడాదిలోగా రూపొందించనున్నారు.

తొలి హైస్పీడ్‌ కారిడార్‌ అయిన ముంబై – అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌‌ నిర్మాణాన్ని 2023 డిసెంబర్‌ నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నారు.

హైస్పీడ్‌ రైల్వే కారిడార్లు..

()ఢిల్లీ – నోయిడా – ఆగ్రా – లక్నో – వారణాసి (865 కి.మీ.)
() ఢిల్లీ – జైపూర్‌ – ఉదయ్‌పూర్‌ – అహ్మదాబాద్‌ (886 కి.మీ.)
() ముంబై – నాసిక్‌ – నాగ్‌పూర్ (753 కి.మీ.)
() ముంబై – పుణే – హైదరాబాద్‌ (711 కి.మీ.)
() చెన్నై – బెంగళూరు – మైసూరు (435 కి.మీ.)
() ఢిల్లీ – చండీగఢ్‌ – లూథియానా – జలంధర్‌ – అమృతసర్‌ (459 కి.మీ.)

- Advertisement -