- Advertisement -
బంగారం ధర కొండెక్కింది. కొత్త రికార్డులు సృష్టిస్తూ ఆల్ టైం గరిష్టస్దాయికి పసిడి ధర చేరింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.640 పెరిగి రూ.54,940కి చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.590 పెరిగి రూ.50,370కు చేరింది.
అయితే పసిడి ధర పెరిగిన వెండి ధర మాత్రం రూ.2700 తగ్గి కిలో వెండి ధర రూ.62,000కు చేరింది. ఢిల్లీ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 పెరిగి రూ.51,250కు చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.450 పెరిగి రూ.52,450కు చేరింది.
కరోనా వైరస్ కారణంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, బలహీనమైన రూపాయి వంటి అంశాలు పసిడి పరుగులకు కారణంగా ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
- Advertisement -