భారీగా తగ్గిన బంగారం ధరలు..

56
- Advertisement -

దేశవ్యాప్తంగా పసిడి ధరలు శనివారం భారీగా తగ్గాయి. గత పది రోజుల్లో బంగారం ధరల్లో భారీగా తేడా కనిపిస్తోంది. ఒక రోజు పెరిగితే మరో రోజు తగ్గింది. గడిచిన 10 రోజుల్లో పసిడి ధర ఏడు సార్లు తగ్గింది. మరో మూడు సార్లు పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.47,250గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,110కు దిగొచ్చింది.

ఇక దేశంలో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్టణంతో పాటు దేశ రాజధాని న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, కేరళలో బంగారం ధరలు దాదాపు ఒకేలా ఉన్నాయి. చెన్నైలో రూ.48,010, పుణెలో రూ.46,900, జైపూర్‌లో రూ.46,880, లక్నోలో 46,950కి తులం బంగారం లభిస్తోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర.. ఏపీ, తెలంగాణ, న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, కేరళలో తులం స్వచ్ఛమైన బంగారం రేటు రూ.51,110గా ఉంది. చెన్నైలో అత్యధికంగా రూ.52,370 పలుకుతోంది. పుణెలో రూ.51,200, జైపూర్‌లో రూ.51,190, లక్నోలో 51,250గా ఉంది.

బంగారంతో పాటు సిల్వర్ రేటు కూడా భారీగా దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం సిల్వర్ రేట్లు రూ.70 వేలుగా ఉన్నాయి. ఇక విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, కేరళలో తులం వెండి ధర రూ.700 గా ఉంది. చెన్నై, ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పుణె, బరోడాలో రూ.650కి లభిస్తోంది.

- Advertisement -