గత కొన్ని రోజులుగా పసిడి ధర భారీగా పెరుగుతూ వస్తోంది.. అయితే ఇప్పుడు బంగారం ధర తగ్గుముఖం పట్టింది. గత మూడు రోజులుగా పసిడి ధర తగ్గుతూనే వస్తోంది. బంగారం కొనాలనుకునే వారికి ఇది శుభవార్త అనే చెప్పాలి. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో పసిడి ధర పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లో బంగారం ధర దిగిరావడం గమనార్హం. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా దిగివచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో శుక్రవారం పసిడి ధర పడిపోయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 దిగొచ్చింది. దీంతో ధర రూ.46,800కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా తగ్గింది. రూ.190 తగ్గుదలతో రూ.48,060కు పడిపోయింది. ఇక కేజీ వెండి ధర ఏకంగా రూ.850 పడిపోయింది. రూ.47,600కు దిగొచ్చింది.
హైదరాబాద్ మార్కెట్‌లో కూడా బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.190 దిగొచ్చింది. దీంతో ధర రూ.46,160కు పడిపోయింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా దిగొచ్చింది. 10 గ్రాముల బంగారం ధర రూ.190 క్షీణతతో రూ.50,370కు తగ్గింది. పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర రూ.850 పతనమైంది. దీంతో ధర రూ.47,600కు దిగొచ్చింది.