- Advertisement -
బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గి రూ.51,350కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 తగ్గి ప్రస్తుతం రూ.56,020కి చేరింది. దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 తగ్గి రూ.51,500గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 తగ్గి రూ.56,170కి చేరింది.
బంగారం బాటలోనే వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 1000 తగ్గి రూ.69,000కు చేరగా దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.700 తగ్గి రూ.66,800కి చేరింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో చూసుకుంటే ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1818 డాలర్ల వద్ద ఉంది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -