- Advertisement -
బంగారం ధరలు ఆల్ టైం హైకి చేరాయి పసిడి ధరలు. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1500 పెరిగి రూ. 55,300కు చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.1630 మేర పెరిగి రూ.60,320కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1500 పెరిగి రూ.55, 450కు చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1630 పెరిగి రూ.60, 470కి చేరాయి.
బంగారం బాటలోనే వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1300 పెరిగి రూ.74,400కి చేరాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2300 పెరిగి రూ.72,100కి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1989.15 డాలర్లకు చేరగా స్పాట్ సిల్వర్ ధర 22.65 డాలర్లుగా ఉంది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -