భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌..

175
gold rate
- Advertisement -

పసిడి కొండెక్కింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర తగ్గినా దేశీయ మార్కెట్‌లో మాత్రం పరుగులు పెట్టింది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 పెరిగి రూ.47,550కు చేరింది.

ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.450 పెర‌గ‌డంతో రూ.48,750గా ఉంది. బంగారం బాటలోనే వెండి కూడా భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.1500 పెర‌గ‌డంతో రూ.50,050కి చేరింది.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,740గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.50,950కు చేరింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధ‌ర ఔన్స్‌కు 1.20 శాతం త‌గ్గ‌డంతో 1779 డాలర్లకు పడిపోయింది.

- Advertisement -