మరోసారి బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మార్పులు, దేశీయ డిమాండ్ పెరగడం వంటి కారణాలతో విలువైన లోహాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఒక్కరోజులోనే రూ.3,220 పెరుగుదల నమోదైంది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,65,170కు చేరింది.
అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా భారీగా పెరిగి లక్షన్నర మార్క్‌ను దాటింది. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ నేపథ్యంలో బంగారానికి డిమాండ్ మరింత పెరగడంతో ధరలు ఇంకా ఎగబాకే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. కిలో వెండిపై ఏకంగా రూ.13,000 పెరుగుదల నమోదైంది. దీంతో కిలో వెండి ధర రూ.4 లక్షల మార్క్‌ను దాటి కొత్త రికార్డు స్థాయికి చేరింది. ఈ ధరల పెరుగుదల సామాన్య వినియోగదారులకు ఆందోళన కలిగిస్తోంది.
Also Read:విమాన ప్రమాదాలు..మృతి చెందిన నేతలు వీరే!

