TTD: శాస్త్రోక్తంగా గోకులాష్టమి

4
- Advertisement -

కార్వేటినగరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత  వేణుగోపాల స్వామివారి ఆలయంలో సోమవారం గోకులాష్టమి ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. ఇందులో భాగంగా స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమల, కొలువు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు స్నపన తిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు.

అనంత‌రం సాయంత్రం 5.30 గంటలకు గోకులాష్టమి ఆస్థానం, పురాణం పఠనం జరిగింది.ఈ సందర్భంగా రాజమహల్ కు చెందిన రాజవంశీకులు శ్రీకృష్ణ ప్రియ బృందం నృత్య నివేదన సమర్పించారు. రాజవంశీకులు గత 58 సంవత్సరాలుగా శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన స్వామివారి ముందు నృత్యం ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది.

కాగా ఆగష్టు 27న ఉట్లోత్స‌వంను పుర‌స్క‌రించుకొని సాయంత్రం 5 గంటలకు గోపూజ, ఉట్లోత్స‌వం, తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ పార్థసారథి, సూప‌రింటెండెంట్ సోమశేఖర్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేష్ కుమార్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యల భక్తులు పాల్గొన్నారు.

Also Read:100 కోట్ల చేరువలో తంగలాన్

- Advertisement -