భద్రాలచం వద్ద మళ్లీ పెరిగిన వరద..

43
bhadrachalam
- Advertisement -

ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద మళ్లీ వరద ఉదృతి పెరుగుతోంది. మంగళవారం ఉదయం నుంచి తగ్గుముఖం పట్టిన గోదావరితో వరద మళ్లీ పెరిగింది. ప్రస్తుతం 13,31,102 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. గోదావరి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది.భారీగా వరద వస్తుండటంతో ఉదయం 7 గంటలకు 51.20 అడుగులకు చేరింది.

భారీగా వరద వస్తుండటంతో రామాలయం పడమరమెట్ల వద్ద నీరుచేరింది. ఆలయ దుకాణాలు నీటమునిగాయి. అన్నదాన సత్రంలోకి వరద నీరుచేరడంతో భక్తులకు అన్నదానం నిలిపివేశారు.

- Advertisement -