భారీ వర్షాలు…గోదారమ్మ ఉగ్రరూపం

44
godavari
- Advertisement -

భారీ వర్షాలతో గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఎగువనుంచి భారీగా వరద పోటెత్తడంతో రాములవారి పాదాల వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి దిగువన ఉన్న ముంపు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. భారీ వర్షాలతో జలాశయంలోకి 85,740 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 9 గేట్లను ఎత్తివేసి 41 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతున్నది. దీంతో అధికారు 19 గేట్లు ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా, ప్రస్తుతం 70.50 మీటర్ల వద్ద నీరు ఉంది.

- Advertisement -