3 లక్షల మెజార్టీతో గోడం నగేష్‌ గెలుపు తథ్యం:సీఎం కేసీఆర్

341
kcr nirmal
- Advertisement -

3 లక్షల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి గోడం నగేష్‌ గెలుపు తథ్యమని చెప్పారు సీఎం కేసీఆర్. నిర్మల్ టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారసభలో మాట్లాడిన సీఎం నాలుగున్నరేళ్లలో తెలంగాణ అన్నిరంగాల్లో ముందంజలో ఉందన్నారు. ఆదిలాబాద్ జిల్లా తెలంగాణకు కాశ్మీర్ లాంటిదని ఎస్సారెస్పీ ద్వారా నిర్మల్, ముథోల్‌లో 50వేల ఎకరాలకు సాగునీరందిస్తామని సీఎం తెలిపారు.

జూన్ తర్వాత దేశమే ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని చెప్పిన సీఎం భూ యజమానికి సంపూర్ణమైన హక్కును కల్పిస్తామన్నారు. ఆదిలాబాద్‌లో సారవంతమైన భూములున్నాయని చెప్పిన కేసీఆర్ ఏడాదిన్నరలో పచ్చని పంట పొలాలతో ఆదిలాబాద్ కళకళలాడుతదన్నారు. పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన సీఎం పహణి నకల్‌ కోసం రైతులు ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిరగకుండాచూస్తామన్నారు.

రైతు బంధు పథకం కింద ఎకరానికి ఏడాదికి రూ.10,000 ఇస్తామన్నారు. రైతు బీమా ద్వారా చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకుంటున్నామని చనిపోయిన రైతు కుటుంబానికి రూ.5లక్షలు పరిహారం అందిస్తున్నామన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్‌వన్ అన్నారు.

బీజేపీ సిగ్గు మాలిన పార్టీ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కేసీఆర్. గత ఎన్నికల్లో 10 కోట్ల మందికి ఉగ్యోగాలిస్తమని చెప్పిన బీజేపీ కోటి మందికన్నా ఉద్యోగాలు ఇచ్చిందా? అని ప్రశ్నించారు . పసుపు బోర్డు పెట్టమని మోడీని ఎన్నోసార్లు అడిగినా పట్టించుకోలేదు. ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా పట్టించుకోకుండా ఇపుడు బీజేపీ నేతలు ఓట్లు అడుగుతున్నరని మండిపడ్డారు. ఎన్నికల వస్తే చాలు పాకిస్థాన్, హిందువుల విషయాలు మోడీకి గుర్తుకొస్తయి. మతం పేరుతో రాజకీయాలు చేయడం తగదన్నారు.

- Advertisement -