అమెరికాలో మేయర్ గా ఎన్నికైన మేక..

372
goat
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికాలో వింతలకు కొదువ ఉందదు. తాజాగా మసాచుసెట్స్ లోని ఫెయిర్ హెవెన్ టౌన్ లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అమెరికాలోని ఓ చిన్న పట్టణంలో సరదా ఎన్నికలు జరిగాయి. ఫెయిర్ టౌన్ ప్లే గ్రౌండ్ నిర్మానం కోసం నిధులు సమీకరించాలని నిర్ణయించారు. మాములుగా అయితే ప్రజలు డబ్బులు ఇవ్వరు కాబట్టి అక్కడ ఓ ఎన్నిక నిర్ణయించారు. అయితే ఈఎన్నికలు మనుషులకు కాదులేండి..కుక్కలు ,పిల్లులు, మేకలు ఈఎన్నికల్లో పోటీ చేస్తాయి.

ఈ పోటీ చేసే జంతువుల యజమానులు ఒక్కొక్కరు ఐదు డాలర్లు కట్టాలి. ఈ ఎన్నికల్లో స్ధానిక స్కూల్ టీచర్ కి చెందిన మేక పోటీలో నిలబడింది. ఇక మరికొందరు తమ కుక్కలు, పిల్లులను కూడా పోటీలో నిలబెట్టారు. చివరకు 13ఓట్ల తేడాతో మూడేళ్ల వయసున్న లింకన్ అనే బుజ్జి మేక మేయర్ గా ఎన్నికైంది. అంతేకాకుండా నగర కౌన్సిల్ కు మరో 15 జంతువులు కూడా ఎన్నికయ్యాయి.

కాగా, లింకన్ ఫెయిల్ హెవెన్ కు ఏడాది కాలం పాటు మేయర్ గా వ్యవహరించనుంది. ఫెయిర్ హెవెన్ పట్టణానికి అధికారికంగా మేయర్ ఏవరూ లేరు. కేవలం మేనేజర్ మత్రమే ఉంటారు. ఈ మధ్య కాలంలో ఓ పిల్లి ఓ చిన్న పట్టణానికి మేయర్ గా ఎన్నికైనట్లు ఓ పత్రికలో చదివాడు. అలాంటి ప్రయత్నం మనమెందుకు చేయకూడదని భావించాడు ఆ మేనేజర్. ఈ క్రమంలోనే ఆయనకు ఇలాంటి ఐడియా వచ్చిందని చెప్పాడు ఫెయిల్ హెవెన్ మేనేజర్ .

- Advertisement -