శుభవార్త…కరోనాకు మందు వచ్చేసింది!

485
glenmark
- Advertisement -

గుడ్ ​న్యూస్​…..భారత్ లో కరోనా రోగుల చికిత్స కోసం ఔషధాన్ని విడుదల చేసినట్లు ప్రముఖ సంస్థ గ్లెన్​మార్క్​ ప్రకటించింది. యాంటీవైరల్​ డ్రగ్​ ఫవిపిరావీర్ ఫాబిఫ్లూ పేరుతో తీసుకొచ్చినట్లు తెలిపింది.

వైరస్ సోకిన రోగులకు చికిత్స కోసం ‘ఫవిపిరావీర్​’ అనే ఔషధాన్ని ఆవిష్కరించింది గ్లెన్​మార్క్. ఫాబిఫ్లూ బ్రాండ్​ పేరుతో తెస్తున్న ఈ ఔషధం తేలికపాటి లేదా ఓ మోస్తరు స్థాయిలో కరోనాతో బాధపడుతున్న రోగులకు ఉపయోగపడుతుందని పేర్కొంది.

200 ఎంజీ టాబ్లెట్ ధర సుమారు రూ.103 వరకు ఉంటుందని, 34 టాబ్లెట్​లు ఉండే ఓ స్ట్రిప్… గరిష్ఠ రిటైల్ ధర రూ.3,500 వరకు ఉంటుందని గ్లెన్​మార్క్ వెల్లడించింది.

- Advertisement -