గ్లైకోమా వ్యాధితో ‘అంధత్వం’ గ్యారెంటీ!

20
- Advertisement -

కళ్ళు అనేవి మనశరీరంలో అత్యంత సున్నితమైన అవయవాలు. ఇవి ఏ మాత్రం దెబ్బతిన్నా జీవితాంతం అంధకారంలో జీవించాల్సిందే. అందుకే కళ్లను శరీరానికి వెలుగు ప్రసార కేంద్రాలుగా అభివర్ణిస్తుంటారు. అయితే నేటి రోజుల్లో కళ్ల సమస్యలు అధికమవుతున్నాయి. చిన్నపిల్లల్లో కూడా దృష్టిలోపం సంభవించడం, కంటిలో శుక్లలు, పొరలు.. ఇలా ఎన్నో సమస్యల కారణంగా చూపు కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. అయితే కళ్ళకు వచ్చే వ్యాధులలో గ్లాకోమా అనేది త్వరగా అంధత్వాన్ని ప్రేరేపించే వ్యాధిఅని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే కళ్ళకు సంభవించే ఈ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెఃచ్చరిస్తున్నారు. ఈ గ్లాకోమా వ్యాధి ఉన్నవారిలో తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు , మసక దృష్టి.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా కళ్ళు ఎర్రబారడం, కళ్ల వాపు, లైట్స్ చుట్టూ ఉండే హలోస్ ( రంగుల రింగులు ) కనిపించడం.. ఇవన్నీ కూడా గ్లైకోమా వ్యాధి లక్షణాలే..

నాలుగు దశలో ఉండే ఈ గ్లైకోమా వ్యాధిని ప్రారంభం లోనే గుర్తించి సరైన వైద్యం తీసుకోవాలి లేదంటే చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. సాధారణంగా ఈ గ్లైకోమా వ్యాధి 40 ఏళ్ళు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే నేటి రోజుల్లో చిన్న వయసు వారిలో కూడా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ఎంతో ముఖ్యం.. ఇక కళ్ల ఆరోగ్యం కొరకు ఆకు కూరలు, కూరగాయలు అధికంగా తినాలి. ఏ విటమిన్ ఎక్కువగా ఉండే పండ్లు లేదా పండ్ల రసాలు సేవించాలి. అలాగే దుమ్ము ధూళి ప్రాంతాలలో పని చేసే వారు కళ్ల రక్షణ కొరకు కళ్ళజోడు ఉపయోగించాలి. కంప్యూటర్ ముందు పని చేసే వారు స్క్రీన్ కు తగు దూరం పాటించాలి. ఇంకా రాత్రిపూట మొబైల్ ఎక్కువ సేపు చూడడం వల్ల కూడా కళ్ల యొక్క ఆరోగ్యం దెబ్బ తింటుంది. కాబట్టి కళ్ల యొక్క ఆరోగ్యం కోసం తప్పనిసరిగా తగు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read:రోహిత్ vs పాండ్య.. ముదురుతున్న వివాదం!

- Advertisement -