తెలంగాణలో వ్యాపార రంగంలో అడుగుపెట్టాలనే గిరిజన యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సీఎం ట్రైబల్ ఎంటర్ప్రైన్యూర్ షిప్ ఇన్నోవేషన్ పథకంను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ పథకం కింద గిరిజన యువ పారిశ్రామికవేత్తలకు మున్సిపల్ ట్యాక్స్‌ను మినహాయింపు ఇస్తామని అన్నారు. హైదరాబాద్‌లోని బంజారాభవన్లో మంత్రులు సత్యవతి రాథోడ్ మహమూద్ అలీతో కలిసి యూనిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ…ఆర్థికంగా అభివృద్ధి చెందితే కుల వ్యత్యాసాలు సమసిపోతాయని మంత్రి అన్నారు. కరోనా వల్ల సమాజంలో అన్ని కులమతాల మధ్య ఉన్న గీతలను చెరిపివేసిందన్నారు. ఇన్నోవేషన్ ఇన్‌ఫ్రాక్ఛర్ ఇంక్లూజివ్ గ్రోత్ అనేవి దేశాభివృద్ధికి మూడు లక్షణాలు అని అన్నారు. భారతీయులు ప్రపంచ అగ్రశ్రేణి సంస్థలకు సీఈవోలగా ఉన్నారని తెలిపారు.
తెలంగాణ సాధించిన విజయాలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదని విమర్శించారు. దేశంలో 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ 30 శాతం పంచాయతీ అవార్డులను గెలుచుకున్నదని చెప్పారు. కొత్త పారిశ్రామిక వేత్తలను మరింతమంది యువతను ప్రోత్సహించాలని సూచించారు. ఎస్టీ యువ వ్యాపారవేత్తలను మున్సిపల్ శాఖ ద్వారా ప్రోత్సహిస్తామన్నారు.
Also Read: వామ్మో జగన్ కు ఇన్ని సమస్యలా.. ఇబ్బందే !
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ భరోసాతో గిరిజన యువత అభివృద్ధి చెందుతున్నారని అన్నారు. గిరిజన యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్న మంత్రి కేటీఆర్‌కు ధన్యావాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న తండాలను గూడెంలను గ్రామ పంచాయితీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున గిరిజనులకు సేవాలాల్ కొమురంభీం భవనాలను ప్రభుత్వం నిర్మించిందని వెల్లడించారు.
Also Read: సామాన్యులపై జీఎస్టీ..అదానీ పోర్టులపై నో జీఎస్టీ!