అల్లం నీళ్ళు తాగితే ఎన్ని లాభాలో..!

25
- Advertisement -

అల్లాన్ని సర్వరోగ నివారిణిగా పరిగణిస్తుంటారు ఆయుర్వేద వైద్యులు. ఎందుకంటే ఎలాంటి ఆరోగ్య సమస్యనైనా ఎదుర్కొనే ఔషధ గుణాలు అల్లంలో మెండుగా ఉంటాయి. అందుకే ఆయుర్వేదంలో అల్లాన్ని విరిగిగా ఉపయోగిస్తుంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు, ఫ్లేవనాయిడ్లు, కెరోటీన్లు.. అన్నీ లభిస్తాయి. ఇంకా కాల్షియం, ఐరన్, కాపర్, జింక్, మాంగనీస్, క్రోమియం వంటి మూలకాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి. అందుకే ప్రతిరోజూ అల్లాన్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. .

అందుకే చాలమంది అల్లం టీ, అల్లం కషాయం, వంటివి సేవిస్తుంటారు. అయితే అవేవీ కాకుండా నార్మల్ గా అల్లం నీళ్ళు తాగిన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. అల్లాన్ని మెత్తగా దంచి మనం తాగే నీటిలో కలుపుకుని ప్రతిరోజూ ఉదయం పడగడుపున తాగితే ఎలాంటి ఆరోగ్య సమస్యనైనా దూరమౌతుంది. ముఖ్యంగా మలబద్దకంతో బాధపడేవారు ప్రతిరోజూ అల్లం నీళ్ళను తాగితే మోషన్ ఫ్రీ అవుతుంది. ఇంకా అల్లం నీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తాయని చెబుతున్నారు నిపుణులు.

ఇంకా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, వ్యర్థాలను బయటకు పంపించి బరువు తగ్గేలా చేస్తాయి. అల్లంలో ఉండే 6-షోగోల్ మూలకం నాడీ వ్యవస్థను క్రమబద్దీకరించి మెదడు పనితీరును మెరుగుపరుస్తుందట. ఒక గ్లాస్ అల్లం నీటిలో రెండు టీ స్పూన్స్ నిమ్మరసం కలుపుకుని రాత్రి భోజనానికి అరగంట ముందు సేవిస్తే తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అంతే కాకుండా నిద్రలేమి సమస్య రాకుండా సహాయపడుతుంది. కాబట్టి అల్లం నీటిని తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

గమనిక ; ఈ సమాచారం మీ అవగాహన కొరకు మాత్రమే అందించడం జరిగింది. పై సలహాలు సూచనలు పాటించే ముందు నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Also Read:ఓట్ మిల్క్ తాగితే.. ఎన్ని లాభాలో!

- Advertisement -