అల్లం పేస్ట్‌ కొంటున్నారా.. జాగ్రత్త..!

596
Ginger garlic paste
Ginger garlic paste
- Advertisement -

హైదరాబాద్‌లో ఎక్కడపడితే అక్కడ ఫుడ్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అంటూ జనాలను ఆకర్షిస్తున్నాయి. మరీ అంత తక్కువ ధరకు భోజనం ఏంటా అంటే.. వంటలోకి వాడే సామన్లు నాణ్యత లేకపోవడమే.. వాటి ధర తక్కవగా ఉండడం.. ఇక ప్రతి ఇంట్లో వంటల్లోకి ఉండాల్సింది అల్లం వెల్లుల్లి పేస్టు.. ఇదిలేనిది వంట కూడా చేయరు.. మరీ ఈ పేస్టును ఎలా తయారు చేస్తున్నారో తెలిస్తే షాక్ తినాల్సిందే.. కల్తీ పదార్థాలు తయారుచేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కేటుగాళ్లపై నిఘా పెట్టి వరుసదాడులు చేస్తున్న హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నాంపల్లి బజార్‌ఘాట్‌లో ఎస్ ఐ ప్రోడక్ట్స్ దుకాణంపై దాడి చేయగా, బాత్‌రూంలు కడిగే యాసిడ్ కలుపుతూ అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న దారుణం వెలుగులోకి వచ్చింది.

Shameem-Akthar

అల్లం వెల్లుల్లి పేస్ట్‌ల తయారీలో యాసిడ్ వాడుతున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విజయ్‌నగర్ కాలనీకి చెందిన షమీమ్ అక్తర్, మహ్మద్ నోమన్ అలియాస్ ఇమ్రాన్ మార్కెట్లో తక్కువ ధరకు లభించే నాసిరకమైన అల్లం, వెల్లుల్లి కొనుగోలు చేస్తుంటారు. వాటికి రంగులు, బాతురూంలను కడిగే యాసిడ్‌లను కలిపి పేస్ట్ తయారు చేస్తున్నారు. దానిని కిలో, ఐదు కిలోల డబ్బాల్లో నింపి సైదాబాద్, మలక్‌పేట్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. అంతేకాదు ఈ పేస్ట్‌ను బెంగళూరు, చెన్నైకు ట్రావెల్ బస్సుల్లో పంపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

కిచెన్ కింగ్, కిచెన్ గోల్డ్, సిటీ బజార్, కిచెన్ ఛాంపియన్ తదితర పేర్లతో కిలో జార్‌కు రూ. 60, ఐదు కిలోల జార్‌కు రూ.250 చొప్పున విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. వారి కింద ఐదుగురు సేల్స్‌మెన్ కూడా ఉన్నారు. వారివద్ద నుంచి నాలుగు క్వింటాళ్ల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, 25 లీటర్ల యాసిడ్, రంగులు, మిక్సింగ్ యంత్రం, 18 క్వింటాళ్ల నాసిరకమైన ముడిసరుకును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -