టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై ఇర్ఫాన్ పఠాన్ సంచలన కామెంట్స్ చేశారు. గిల్ ఫామ్‌లో లేకపోవడం అతనిపైనే కాదు, జట్టు మేనేజ్‌మెంట్‌పైనా ఒత్తిడిని పెంచుతోంది. “ఇంకేం చేయాలి? పరిస్థితి ఇంకా చెడిపోకూడదని మాత్రమే ఆశిస్తారు” అని వ్యాఖ్యానించారు.
గిల్ మంచి బంతి పడింది అంటాడు, కానీ ఆయన క్రీజ్‌లో బిగుసుకుపోయాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విషయానికి వస్తే… అతని ఆఫ్‌సైడ్ ఆటను మెరుగుపరచాలి. అతను పూర్తిగా పొజిషన్‌లో లేకపోయాడు. గిల్ ఫామ్‌లో ఉంటే ఆ బంతిని సులభంగా ఆడేవాడు. ఇప్పుడు అతను ఫామ్‌లో లేడు అన్నారు.
గిల్ బ్యాట్‌లో నుండి రన్స్ రావడం లేదు — ఇది చెడు సూచన. అతనిపైనా, జట్టు మేనేజ్‌మెంట్‌పైనా ఒత్తిడి పెరుగుతోంది. ‘ఏం చేయాలి?’ అనే స్థితి. ఇది ఇంకా దిగజారకూడదు. ఇదిఇలా కొనసాగితే, సామ్‌సన్‌ను తెచ్చినా అతను కూడా రస్ట్‌గా ఉంటాడు. వెంటనే రన్స్ ఆశించడం కష్టమే. చాలా ప్రశ్నలు ఉన్నాయి. శాంసన్ తిరిగి వస్తే, అతనికి రన్స్ చేయడం చాలా అవసరం అవుతుంది అన్నారు.
Also Read:AP:అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సూర్య కెప్టెన్‌గా ఉన్నాడు కనుక ప్లేయింగ్-11లో అతని స్థానం ఆటోమేటిక్‌గా సురక్షితం. కానీ ఏడాది నుంచి పెద్ద స్కోర్ చేయకపోవడంతో అతనిపై ఒత్తిడి ఉంటుంది. ప్రపంచ కప్‌కు ముందే ఫామ్ దొరకాలి. సరైన బ్యాటింగ్ స్థానం, మంచి షాట్ సెలెక్షన్ అవసరం. సూర్య స్ట్రైట్ బంతులను లెగ్‌సైడ్‌కు ఆడే పద్ధతి కారణంగా ఔటవుతున్నాడు. స్కోర్లు రావడం లేదంటే ఆఫ్‌సైడ్, స్ట్రైట్‌లో ఆడాలి. బంతిని కళ్ల ముందుకు తెచ్చుకుని పేస్‌ను వాడుకునే స్కిల్ అతనికి ఉంది. అలా చేస్తే తిరిగి రన్స్ వస్తాయి అని పఠాన్ పేర్కొన్నారు.

