2025 ప్రారంభంలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి Dominic and the Ladies’ Purse అనే మిస్టరీ కామెడీ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ..మలయాళ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా అడుగుపెట్టారు.
పది నెలలకుపైగా సినిమా థియేటర్లలో రిలీజ్ అయి గడిచినా, ఇప్పటి వరకు ఈ చిత్రానికి ఓటీటీ రిలీజ్ దొరకలేదు. డిజిటల్ పార్ట్నర్‌ను ఖరారు చేయడంలో సమస్యలు ఎదుర్కొన్న తర్వాత, చివరకు శుభవార్త వచ్చింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా డిసెంబర్ 19 నుంచీ ZEE5లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.
ఇతర భాషా వెర్షన్‌ల గురించి మాత్రం ఇంకా ఎలాంటి అప్‌డేట్ లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోయింది. మమ్ముట్టి స్వయంగా ఈ సినిమా నిర్మాణం మమ్ముట్టి బ్యానర్‌పై చేశారు. గోకుల్ సురేష్, సుష్మితా భట్, విజయ వెంకటేష్, సిద్ధిక్ తదితర కళాకారులు ముఖ్య పాత్రల్లో నటించారు.
Also Read:AP:అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

