ఈ రోజు శ్రీ పార్వతి దేవి శ్రీ కైలాసనాధ స్వామి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్బంగా బోరంపేట్ సతీష్ నగర్ లో తెలంగాణ మేకప్ యూనియన్ ప్రెసిడెంట్ గుండుమళ్ల రఘు ఆధ్వర్యంలో కాశినుండి విచ్చేసిన శ్రీశ్రీశ్రీ 1008 జగ్ధ్గురు చంద్రశేఖర శివాచార్య మహాస్వాముల వారు మరియు వేద పండితులు, దేవాలయ కమిటీ చైర్మన్ గుండు మళ్ల వర్ణలత గారు మరియు సభ్యులు ఆలయ పరిధిలో శివిడికి ఎంతో ప్రియమైన బిల్వ మొక్కలను నాటడం జరిగింది.
స్వామిజీ మాట్లాడుతూ ఈ రోజు ద్వితీయ వార్షికోత్సవ సందర్బంగా శివుడికి ఎంతో ఇస్టమయిన బిల్వ మొక్కలను నాటడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. దేవాలయ పరిధిలో జమ్మి మొక్కలు గానీ, బిల్వ మొక్కలు నాటడం మన హిందూ సంప్రదాయం, సనాతన ధర్మాన్ని కాపాడడం అన్నారు. ప్రతీ దేవాలయం పరిధిలో వృక్షాలు ఉంటే వచ్చిన భక్తులకు ప్రశాంత వాతావరణం నెలకొంటుంది అన్నారు.
ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని వాటిని సంరక్షణ చేసే బాధ్యత చేపట్టాలని అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి పరమ శువుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరడం జరిగింది . ఈ కార్యక్రమం గ్రీన్ ఇఇండియా హరితసేన రాష్ట్ర కోర్డినేటర్ గర్రెపల్లి సతీష్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


