- Advertisement -
కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు సీనియర్ నేత గులాంనబీ అజాద్. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆజాద్…పార్టీకి చెందిన అన్ని పోస్టుల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అయిదు పేజీల లేఖను ఆయన రాశారు. పార్టీలో సంప్రదింపుల ప్రక్రియ లేకుండాపోయిందని…. రాహుల్ గాంధీ వైస్ ప్రెసిడెంట్ అయ్యాక పార్టీ నాశనమైనందని తెలిపారు.
ఏఐసీసీ కోటరీలో పట్టుదల, సత్తా లోపించిందని… 50 ఏళ్లు సేవ చేసిన పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఆజాద్ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి భారీ జలక్ తగిలినట్లు అయ్యింది.
- Advertisement -