గ్రేటర్ ఎన్నికలు..ఓటర్ స్లిప్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

203
ghmc
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. కరోనా నేపథ్యంలో అన్నిజాగ్రత్త చర్యలను తీసుకున్నారు.

ముఖ్యంగా పోలింగ్ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన అధికారులు ఓటర్‌ స్లిప్‌ని నేరుగా డౌన్‎లోడ్ చేసుకునే విధంగా ఓ యాప్‎కు రూపకల్పన చేయించారు.మై జీహెచ్ఎంసీ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని దాని ద్వారా ప్రజలు ఓట‌రు స్లిప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఎన్నికల అధికారులు సూచించారు.

ఈ యాప్‌లో డౌన్‌లోడ్‌ యువర్‌ ఓటర్‌ స్లిప్‌ ఆప్షన్‌ క్లిక్‌ చేసి పేరు, వార్డు నంబర్ నమోదు చేయడం ద్వారా ఓటరు స్లిప్, పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందనే విషయాన్ని గూగుల్ మ్యాప్‌లో చూడవచ్చని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఓట‌రు గుర్తింపు కార్డు లేనివారు గుర్తింపు నిర్థార‌ణ‌కు ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్ లైసెన్స్‌, ఫోటోతో కూడిన‌ స‌ర్వీస్ ఐడెంటిఫైకార్డ్‌, బ్యాంకు పాస్‌బుక్‌, పాన్ కార్డు, ఆర్‌.జి.ఐ, ఎన్‌.పి.ఆర్ స్మార్ట్ కార్డు, జాబ్ కార్డు, హెల్త్ కార్డు, పింఛ‌న్‌ డాక్యుమెంట్, ఎంఎల్‌ఏ, ఎంపీ, ఎమ్మెల్సీల‌కు జారీచేసిన అధికారగుర్తింపు ప‌త్రం, రేషన్ కార్డు, కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం, ఫ్రీడమ్ ఫైటర్ ఐడెంటిఫై కార్డు, ఆర్మ్స్ లైసెన్స్ కార్డు, అంగవైకల్యం సర్టిఫికేట్, లోక్ సభ, రాజ్యసభ మెంబర్ ఐడెంటిఫై కార్డు, పట్టదారు పాస్‎బుక్ లాంటి ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డుల‌లో ఏ ఒక్కటైనా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.

- Advertisement -