లక్నో స్మార్ట్ సిటీని సందర్శించిన మేయర్ బృందం

4
- Advertisement -

లక్నో స్మార్ట్ సిటీలో బెస్ట్ ప్రాక్టీసెస్ అధ్యయన పర్యటనలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి 40 మంది కార్పొరేటర్లతో కలిసి సోమవారం లాల్ బాగ్ లోని లక్నో స్మార్ట్ సిటీ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ మూడు కమాండ్ సెంటర్లలో నిర్వహిస్తున్న కార్యకలాపాలను మేయర్ బృందం పరిశీలించింది.

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కమాండ్ సెంటర్: బ్యాటరీతో నడిచే ఆటోల ద్వారా ఇంటింటికి చెత్త సేకరణ జరుగుతున్నట్లు, ప్రతి కాలనీలో షెడ్యూల్ సమయం మేరకు నిర్దేశించిన రూట్ లలో ఆటోలు వెళ్లేలా ఆటోల కదలికలను సిస్టం కంట్రోల్ రూం నుండి పర్యవేక్షిస్తున్నట్లు పరిశీలించారు. ఆటోలు వెళ్లనట్లైతే గుర్తించి కమాండ్ కంట్రోల్ సెంటర్ సంబంధిత సూపర్వైజర్ ను అక్కడకు పంపి వాకీటాకి ద్వారా అప్రమత్తం చేయడం జరుగుతుంది. ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా ఆటోల ద్వారా ఇంటింటికి వెళ్లి చెత్త సేకరిస్తున్నారని, తడి, పొడి చెత్తను విడిగా ఇచ్చేలా సంబంధిత ఏజెన్సీ పౌరులకు అవగాహన కల్పిస్తున్నట్లు గమనించారు.

Also Read:తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం

- Advertisement -