గ్రేటర్‌లో బస్తీ దవాఖానాలు:బొంతు రామ్మోహన్

556
bonthu rammohan
- Advertisement -

48 కమ్యునిటి హాళ్లలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు . బొంతు రామ్మోహ‌న్ అధ్య‌క్ష‌త‌న జరిగిన స్టాండింగ్ కమిటీ స‌మావేశg జరుగగా గ్రేటర్ హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలలోని వివిధ కేటగిరిలకు చెందిన అడ్వర్ టైజ్ మెంట్ రేట్లను పునర్ వ్యవస్థీకరించి, వార్షిక అడ్వర్ టైజ్ మెంట్ ఫీజుల చెల్లింపు ద్వితీయార్థానికి వర్తించేలా ప్రవేశపెట్టిన తీర్మాణానికి ఆమోదం తెలిపారు.దీంతో పాటు పలు తీర్మానాలకు అమోదం తెలిపారు.

·జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు క్రీడా అంశాల శిక్షణకు చెల్లిస్తున్న యూజర్ చార్జీల పునర్ వ్యవస్థీకరణకు ఆమోదం.

·రాజేంద్రనగర్ సర్కిల్ సోగ్ బౌలిలో అపార్ట్ మెంట్ నిర్మాణ అనుమతికి కావాల్సిన 74.86 చదరపు అడుగుల జిహెచ్ఎంసి పార్కు స్థలానికి ప్రత్యామ్నయంగా అదే ప్రాంతంలో భూమిని కేటాయించే తీర్మానానికి ఆమోదం.

·జిహెచ్ఎంసి భూసేకరణ విభాగం, ఎలక్షన్ సేల్ విభాగాల్లో పనిచేస్తున్న ఆరుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్ల సర్వీసులను 2020 ఏప్రిల్ 31వ తేదీ వరకు పొడిగించే తీర్మానానికి ఆమోదం.

·జిహెచ్ఎంసి కి చెందిన మరో 48 కమ్యునిటిహాళ్లలో 500 చదరపు అడుగుల స్థల విస్తీర్ణంలో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసేందుకు అనుమతి తీర్మానం ఆమోదం.

·చందానగర్ రైల్వేస్టేషన్ నుండి మంజీర పైప్ లైన్ వరకు 150 అడుగుల మేర రోడ్డు విస్తరణ ప్రతిపాదనలకు ఆమోదం.

·శేరిలింగంపల్లి సర్కిల్ లోని మాధవి హిల్స్ నుండి నార్నె రోడ్డు వరకు 36 ఫీట్ల మేర రోడ్డు విస్తరణ ప్రతిపాదనలకు ఆమోదం.

·బాలానగర్ వై జంక్షన్ వద్ద 60 మీటర్ల మేర రోడ్డు విస్తరణ ప్రతిపాదనలకు ఆమోదం.

·దివ్యశ్రీ కాంప్లెక్స్ నుండి నాగ హిల్స్ మీదుగా ఖాజాగూడ మెయిన్ రోడ్ వరకు 18 మీటర్ల మేర రోడ్డు విస్తరణ ప్రతిపాదనలకు ఆమోదం.

·జిహెచ్ఎంసిలో ఉన్న 135 మోడ్రన్ జిమ్ లను ఉపయోగించేవారు జిహెచ్ఎంసి పోర్టల్ www.ghmc.gov.in/sports అనే వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో సభ్యత్వానికి పేర్లను నమోదు చేసుకునే ప్రతిపాదనలకు ఆమోదం.

·రిటైర్డ్ డిప్యూటి తహశిల్దార్ మహ్మద్ అబ్దుల్ సలాం ను జిహెచ్ఎంసి, సెక్రటేరియట్ ల మధ్య లైసన్ ఆఫీసర్ గా కాంట్రాక్ట్ పద్దతిపై సంవత్సరం పాటు నియామకానికి ఆమోదం.

·ప్రస్తుతం వివిధ ట్రాన్స్ ఫర్ స్టేషన్ల నుండి జవహర్ నగర్ డంప్ యార్డ్ వరకు గార్బేజ్ ను తరలించేందుకు ఉపయోగిస్తున్న 25 టన్నుల వాహనాలలో కైతలాపూర్ ట్రాన్స్ ఫర్ స్టేషన్ నుండి జవహర్ నగర్ డపింగ్ యార్డ్ వరకు గార్బేజ్ ను తరలించడానికి మూడు వాహనాలను అద్దె ప్రాతిపదికన తీసుకున్న ప్రతిపాదనలకు ఆమోదం.

·2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను అడ్వర్ టైజ్ మెంట్ హోర్డింగ్ లకు సవరించిన చార్జీల మొత్తాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో చెల్లించేందుకు 30రోజుల గడువును ఏజెన్సీలకు ఇస్తూ తీర్మానానికి ఆమోదం.

·ఎస్.ఆర్.డి.పి పథకానికి నిధులకు గాను బాండ్ల సేకరణ బిడ్డింగ్ లో పాల్గొని రూ.20కోట్లు లేదా అంతకన్న ఎక్కవ మొత్తానికి ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ లో పాల్గొనే బిడ్డర్లకు ప్రభుత్వ నిబంధనలను అనుసరించి 0.10శాతం ఫీజును అందించే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపే తీర్మానానికి ఆమోదం.

·నల్లగండ్ల పెద్ద చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ది చేసి నిర్వహించేందుకు సి.ఎస్.ఆర్ కింద చేపట్టడానికి మేసర్స్ అపర్ణ ఇన్ ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఒప్పందానికి ఆమోదం.

· గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 687.31 కిలోమీటర్ల ప్రధాన రహదారులను వార్షిక నిర్వహణ పద్దతిలో ఏజెన్సీలకు అందించేందుకు రూపొందించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపే తీర్మానానికి ఆమోదం.

బొంతు రామ్మోహ‌న్ అధ్య‌క్ష‌త‌న జరిగిన స్టాండింగ్ కమిటీ స‌మావేశానికి జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డి.ఎస్.లోకేష్ కుమార్ తోపాటు స్టాండింగ్ కమిటిలో స‌భ్యులు చెరుకు సంగీత ప్రశాంత్‌గౌడ్‌, సమీనా బేగం, మహ్మద్ అబ్దుల్ రహమాన్, ముస్తఫా అలీ, మిస్ బా ఉద్దీన్, మాజిద్ హుస్సేన్, ఎం.మమత, మహ్మద్ అఖీల్ అహ్మద్, షేక్ హమీద్, తొంట అంజయ్య, సబీహా బేగం, సామల హేమ లుపాల్గొన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు అద్వైత్‌కుమార్ సింగ్‌, శృతిఓజా, సందీప్ జా, సిక్తాపట్నాయక్, కెన‌డి, విజయలక్ష్మి, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, జోనల్ కమిషనర్లు హరిచందన, ముషారఫ్ అలీ, శ్రీ‌నివాస్‌రెడ్డి, శంక‌ర‌య్య‌, మమత, సి.ఇ.శ్రీధర్, జియాఉద్దీన్, సిసిపి దేవేంద‌ర్‌రెడ్డి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

- Advertisement -