జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ… 14 తీర్మానాలకు ఆమోదం

599
ghmc
- Advertisement -

న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అధ్య‌క్ష‌త‌న ఇవాళ స్టాండింగ్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌తో పాటు స్టాండింగ్ క‌మిటీ స‌భ్యులు చెరుకు సంగీత ప్ర‌శాంత్‌గౌడ్‌, స‌మీనబేగం, మ‌హ్మ‌ద్ అబ్దుల్ రెహ‌మాన్‌, మిస్‌బా ఉద్దీన్, యం.మ‌మ‌త‌, ఎక్కెల చైత‌న్య క‌న్నా, మ‌హ్మ‌ద్ అఖీల్ అహ్మ‌ద్‌, షేక్ హ‌మీద్‌, తొంట అంజ‌య్య‌, స‌బీహ బేగం, రావుల శేష‌గిరి, సామ‌ల హేమ‌, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు, జోన‌ల్ క‌మిష‌న‌ర్లు, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో 14 ఎజెండా అంశాల‌ను చ‌ర్చించి ఆమోదించారు.

స‌మావేశంలో ఆమోదించిన తీర్మానాలు

* జ‌న‌న‌, మ‌ర‌ణ ధృవీక‌ర‌ణ ప‌త్రాల జారీ ప‌క్రియ‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించేందుకు మీ-సేవా సేవ‌ల‌ను వినియోగించుట‌కు ఆమోదం.

* రూ. 5 కోట్ల‌తో ఆద‌ర్శ‌న‌గ‌ర్ కాల‌నీ నుండి మూసి రివ‌ర్ ప‌క్క నుండి నాగోల్ జంక్ష‌న్‌ ఎస్‌.ఆర్‌.డి.పి ఫ్లైఓవ‌ర్ వ‌ర‌కు 1600 ఎంఎం డ‌యా పైప్‌లైన్ నిర్మాణంకు ఆమోదం.

* ఓ ఆర్ ఆర్ సర్వీసు రోడ్డు నుండి వయా ఉర్దూ యూనివర్సిటీ ద్వారా ఖాజాగూడ లేక్ వరకు 36 మీటర్లు రహదారి నిర్మాణంలో ప్రభావితమయ్యే ఓపెన్ ల్యాండ్‌ సేకరించుటకు ఆమోదం.

* రత్నదీప్ సూపర్ మార్కెట్ నుండి వయా శేరిలింగంపల్లి జోనల్ ఆఫీస్ ద్వారా నల్లగండ్ల లేక్ వరకు 36 మీటర్ల వెడల్పు రోడ్డు నిర్మాణంలో ప్రభావితమయ్యే ఆస్తులు సేకరించుటకు ఆమోదం.

* హెచ్.టి లైన్ నుండి మియాపూర్ రోడ్ (వుడెన్ ఫర్నిచర్ నుండి మహీంద్రా షో రూమ్ )వరకు 36 మీటర్లు వెడల్పు లింక్ రోడ్ నిర్మాణానికి ప్రభావితమయ్యే ఆస్తులు సేకరణకు ఆమోదం.

* బండ్లగూడ అరుణోదయ నగర్ అనంతుల రాంరెడ్డి గార్డెన్స్ పక్కన నాగోల్ ఆర్‌టిఏ ఆఫీస్ నుండి లావిష్ లుక్స్ బూటీ పార్లర్ వరకు 18 మీటర్ల వెడల్పు రోడ్డు నిర్మాణంలో ప్రభావితమయ్యే ఆస్తులు సేకరణకు ఆమోదం.

* యాక‌త్‌పుర -ఉప్పుగూడ‌ రైల్వే స్టేషన్ మధ్య 11/900-12/0 కిలోమీటర్లు పొడవున ఆర్‌.యు.బి మరియు పరిసర డ్రైనేజీల పక్కన అప్రోచ్ రోడ్డులు నిర్మించుటకు రూ. 4, 45, 84, 356/-లను రైల్వే వారికి డిపాజిట్ చేయుటకు ఆమోదం.

* బార్కాస్ ప్లే గ్రౌండ్ లో నిర్మించతలపెట్టిన comprehensive development of foot ball stadium ను ఫలక్ నుమా ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ కు మార్చుటకు ఆమోదం.

* ఆల్వాల్ ఇందిరాగాంధీ విగ్రహం జంక్షన్ ను అభివృద్ధి చేయుటకు అవసరమైన ఆస్తులు సేకరణకు ఆమోదం.

* కూకట్ పల్లి పేజ్ -4 నుండి ప్రతిపాదిత స్లిప్ రోడ్ (మజిద్ -మునజా నుండి ముళ్ల కతువా చెరువు )వరకు 45 మీటర్ల వెడల్పు లింక్ రోడ్ నిర్మాణానికి అవసరం అయిన భూమి సేకరణకు ఆమోదం.

* స‌న‌త్‌న‌గ‌ర్‌ ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుండి బాలానగర్ ఆర్‌.యు.బి వరకు 30 మీటర్లు వెడల్పు రోడ్డునిర్మాణానికి అవసరమైన భూమి సేకరణకు ఆమోదం.

* న్యూ అల్లాపూర్ నుండి సున్నం చెరువు వరకు 80 అడుగుల వెడల్పు రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు ఆమోదం.

* స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా నెల‌కోల్పిన‌ ప్రాజెక్ట్ అమలు యూనిట్ లో ఖాళీ అయిన ఇద్దరు నిపుణుల నియామకానికి ఆమోదం.

* అన్న‌పూర్ణ మీల్స్ ప్రాజెక్ట్ కింద అగ్రిమెంట్ ప్ర‌కారం హ‌రేకృష్ణ మూమెంట్ చారిట‌బుల్ ట్ర‌స్ట్‌కు బ‌కాయిల‌ను చెల్లించుట‌కు ఆమోదం.

- Advertisement -