నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన నేడు స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్‌తో పాటు స్టాండింగ్ కమిటీ సభ్యులు గంధం జోత్న్స, ముద్ర బోయిన శ్రీనివాసరావు, జువెరియా ఫాతిమ, మిర్ బసిత్ అలీ, సామ స్వప్న, మిర్జ ముస్తఫా బేగ్, సున్నం రాజ్ మోహన్, ముఠా పద్మ నరేష్, కొలను లక్ష్మి, వి.సింధు, సబితా కిషోర్, బైరగోని ధనంజనభాయ్, ఎ.అరుణ, సిసిపి దేవేందర్‌రెడ్డి, సి.ఇ జియాఉద్దీన్, అదనపు కమిషనర్ రాహుల్ రాజ్, జోనల్ కమిషనర్లు ఇతర అధికారులు హాజరయ్యారు. ముందుగా స్టాండింగ్ కమిటీకి నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులకు మేయర్, కమిషనర్ స్వాగతం పలికారు. ఈ సమావేశంలో 14 ఎజెండా అంశాలను చర్చించి ఆమోదించారు.
1) గతంలో వలే ప్రతి గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని ఆమోదించడమైనది.
2) కామినేని జంక్షన్ నుండి నాగోల్ ఆర్టీఏ ఆఫీస్ వరకు 60 మీటర్ల వెడల్పుతో రోడ్డు విస్తరణకు అవసరమైన ఆస్తుల సేకరణకు ఆమోదం.
3) దేవరకొండ సాగర్ జంక్షన్ నుండి హుడా హైట్స్ వరకు 12 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణానికి అవసరమైన ఆస్తుల సేకరణకు ఆమోదం.
4) సికింద్రాబాద్, చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి జోన్లలో రోడ్లపై ఏర్పడిన గుంతలను వార్షిక కాంట్రాక్ట్ ద్వారా పాట్‌హోల్ రిపేర్ మిషన్‌తో రిపేర్ చేసేందుకు కమిటీ ఆమోదం.
5) సికింద్రాబాద్ జోన్ బేగంపేట సర్కిల్‌లో రాష్ట్రపతి రోడ్ సమీపంలో ఉన్న చిత్ర దర్గా వద్ద వర్షపునీరు నిల్వకుండా రూ. 3.12 కోట్లతో కళాసిగూడ నాలాపై ప్రీకాస్ట్ ఆర్.సి.సి బాక్స్ కల్వర్ట్ నిర్మాణానికి ఆమోదం.
6) ఐటి విభాగంలో పనిచేస్తున్న 28 మంది ఐటి నిపుణుల సేవలను మరో మూడేళ్ల పాటు పొడిగించుటకు ఆమోదం.
7) జిహెచ్‌ఎంసి పరిధిలో ఉన్న ఐదు యానిమల్ కేర్ సెంటర్లను 24/7 పద్దతిలో పనిచేయించుటకు ప్రస్తుతం ఉన్న 15 మంది పారా వెటర్నరీ సిబ్బందికి అదనంగా మరో ఐదుగురిని ఔట్ సోర్సింగ్ పద్దతిలో నియమించుటకు ఆమోదం.
8) దోమల నియంత్రణకు ఉపయోగిస్తున్న ఫాగింగ్ యంత్రాల వినియోగాన్ని మానిటరింగ్ చేసేందుకు ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్ట్ కింద 64 వెహికిల్ మౌంటెడ్ ఫాగింగ్ మిషన్లు, 10 పోర్టబుల్ ఫాగింగ్ మిషన్లకు ఐటి పరికరాలను అమర్చి రోజువారి వినియోగం నివేదికను పొందుటకు కమిటీ ఆమోదించడమైనది. ప్రతి వెహికిల్ మౌంటెడ్ ఫాగింగ్ మిషన్లు ప్రతిరోజు 20 కిలోమీటర్ల రోడ్లలో ఫాగింగ్ చేస్తే ఆరు రోజులలో 64 మిషన్లతో 7,680 కిలోమీటర్లు పూర్తవుతుంది. అలాగే 10 పోర్టబుల్ ఫాగింగ్ మిషన్ల ద్వారా మిగిలిన 1620 కిలోమీటర్లు చేయవచ్చు. తద్వారా జిహెచ్‌ఎంసి పరిధిలో ఉన్న 9,300 కిలోమీటర్లు వారానికి ఒక రౌండ్ ఫాగింగ్ జరుగుతుంది. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఈ మిషన్లకు ఏర్పాటుచేసిన పరికరాలను జిహెచ్‌ఎంసిలోని డ్యాష్ బోర్డ్‌కు అనుసంధానం చేయడం జరుగుతుంది.
9) సింగరేణి కాలనీ చౌరస్తా నుండి సరూర్‌నగర్ చెరువుకు వెళ్లే స్టామ్ వాటర్ డ్రెయిన్ ను రూ.3 కోట్లతో రీ మోడలింగ్ చేసేందుకు ఆమోదం.
10) బి.ఎస్.ఎన్.ఎల్ ఖాళీ స్థలం నుండి రెడ్డి కాలనీ సమీపం ద్వారా రోడ్ నెం-13 సింగరేణి కాలనీ చౌరస్తా, ఐఎస్ సదన్ వార్డు నెం-38 వరకు రూ. 5.99 కోట్లతో ఆర్.సి.సి స్టామ్ వాటర్ బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి ఆమోదం.
11) భూసేకరణ విభాగంలో ఒక రిటైర్డ్ తహశిల్దార్ సేవలను పొడిగించుటకు ఆమోదం.
12) భూసేకరణ విభాగంలో ఇద్దరు చైన్ మెన్‌ల సేవలను పొడిగించుటకు ఆమోదం.
13) కోవిడ్-19 పరిస్థితులలో శానిటేషన్, ఎంటమాలజి విభాగాలలో పనిచేస్తున్న సిబ్బందికి టౌన్‌లేవల్ ఫెడరేషన్ల ద్వారా అత్యవసరంగా రూ.36 లక్షలతో 3 లక్షల క్లాత్ మాస్కులను అందించుటకు తీసుకున్న చర్యలకు ఆమోదం. వీటిలో 1,80,000 క్లాత్ మాస్కులను ప్రతి కార్మికుడికి ఆరు చొప్పున ఇప్పటికే అందజేశారు. అలాగే 27వేల మంది శానిటేషన్, ఎంటమాలజి సిబ్బందికి అత్యవసరంగా కొనుగోలుచేసి అందించిన హెవీ డ్యూటి రబ్బర్ హ్యాండ్ గ్లౌస్ కు రూ. 17,52,300 మంజూరుకు ఆమోదం.
14) టౌన్‌ప్లానింగ్ విభాగంలో రిటైర్డ్ అయిన టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్ సేవలను ఔట్‌సోర్సింగ్ పద్దతిలో వినియోగించుకొనుటకు ఆమోదం.