GHMC:ఇకపై ఖాళీ స్థలానికి పన్ను కట్టాల్సిందే!

3
- Advertisement -

ఇకపై జీహెచ్ఎంసీ పరిధిలో ఖాళీ స్థలానికి కూడా పన్ను కట్టాల్సిందే. ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ మార్గాలు అన్వేషిస్తున్న రేవంత్ ప్రభుత్వం తాజాగా ఖాళీ స్థలాలకు పన్నులు వేసేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి త్వరలో ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.

ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఖాళీ ప్లాట్‌లలో బోర్డులు ఏర్పాటు చేయనుంది జీహెచ్ఎంసీ. ఎలాంటి నిర్మాణం జరగకుండా ఖాళీ ప్లాట్ ఉన్నప్పటికీ, జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 212(2) మేరకు వేకెంట్ ల్యాండ్ టాక్స్ (వీఎల్‌టీ) చెల్లించాలని.. భూమి ధర మార్కెట్ రేట్లో 0.05 శాతం వీఎల్‌టీ చెల్లించాల్సిందేనని తెలిపారు అధికారులు.

రెండేళ్ల క్రితం రిజిస్ట్రేషన్ల మేరకు వీఎల్‌టీ చెల్లించాల్సిన ప్లాట్లు 31వేల వరకు ఉండగా.. వీఎల్‌టీ వసూలైతే దాదాపు రూ.110 కోట్ల మేర జీహెచ్ఎంసీ ఖజానాకు చేరతాయని అంచనా వేస్తున్నారు అధికారులు. ప్లాట్ నుంచి చెల్లించాల్సిన వీఎల్డీ చెల్లించకపోతే బకాయిలున్నట్లు ప్లాట్లలో ఫ్లెక్సీ బోర్డులు సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అధికారులు.

Also Read:దమ్ముంటే బీజేపీ నుండి సస్పెండ్ చేయండి!

- Advertisement -