పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సర్కారు ఖజానా గలగల లాడుతోంది. రద్దరుున రూ.500, రూ.1,000 నోట్లతో ప్రభుత్వ విభాగాల బిల్లులు, బకారుులు చెల్లించవచ్చన్న వెసులుబాటుతో కోట్లకు కోట్లు వచ్చిపడుతున్నాయి. బకాయిలు, సాధారణ బిల్లులను పాత నోట్లతో చెల్లించొచ్చని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గత కొద్ది రోజులుగా జీహెచ్ఎంసీ బిల్లులు చెల్లించేందుకు నగర వాసులు క్యూ కట్టారు. రెవిన్యూ వసూళ్లలో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో 252 శాతం పన్ను వసూలైనట్టు తెలిపింది. నగరాల్లో వివిధ రూపాల్లో పన్ను వసూలు జరిగిందని కేంద్రం పేర్కోంది.
గతేడాది నవంబర్‌లో రూ. 489 కోట్లు రాగా… ఈ ఏడాది నవంబర్‌లో రూ. 1722 కోట్ల రెవిన్యూ వసూళ్లు వచ్చాయని ఆర్థిక శాఖ ప్రకటించింది. మొండి బకాయిలను వసూలు చేసేందుకు వీలుగా రద్దైన పాత నోట్లను కేంద్ర అనుమతించింది. దీంతో పాతనోట్లతో తమ పాత బకాయిలను చెల్లించడానికి దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాల్లోని ప్రజలు ముందుకొచ్చారు. ఇక ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ ఈ-చలాన్లను కూడా వాహనదారులు రద్దరుున నోట్లతో క్లియర్ చేసుకొంటున్నారు.