కవితకు అరుదైన గౌరవం…

228
villagers rename KCR's daughter
- Advertisement -

రాజకీయ నాయకుల పేర్లను వీధులకు, జిల్లాలకు పెట్టడం ఇప్పటి వరకు చూసాం. కానీ ఊరి పేరునే మార్చి రాజకీయ నాయకురాలి పేరును పెట్టడం మాత్రం చాలా అరుదు. అలాంటి అరుదైన గౌరవం నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు దక్కింది. నిజామాబాద్ జిల్లాలోని ఖానాపూర్ గ్రామ ప్రజలు తమ ఊరి పేరును మార్చేశారు. ఖానాపూర్‌ను కవితపూర్‌గా నామాకరణం చేశారు. ఈ మేరకు ఊరిలో బ్యానర్లు కూడా కట్టారు. ఊళ్లోకి కొత్తగా వచ్చేవారికి ఈ విషయం తెలియాలని ఊరి ఎంట్రన్స్‌లో ఈ బ్యానర్ ఏర్పాటుచేశారు.

villagers rename KCR's daughter
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పరిధిలోని ఖానాపూర్ గ్రామ పంచాయితీలో దాదాపు 274 కుటుంబాలు నివాసముంటున్నాయి. శ్రీరాంసాగర్ ముంపు గ్రామం కావడంతో వరదలొచ్చిన ప్రతిసారి ఈ గ్రామ ప్రజలు భయంతో బిక్కు బిక్కు మంటూ బతుకల్సిన పరిస్థితి. ఈ విషయాన్ని ఎంపీ కవిత దృష్టికి తీసుకెళ్లాగా ఎంపీ ఆ గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఆ గ్రామ ప్రజలకు వేరే చోట డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని కవిత హామీ ఇచ్చారు. ఈ ఒక్క హామీతో ఆమెపై ప్రజల్లో అభిమానం మరింత పెరిగింది. తమ అభిమానాన్ని చాటుకుంటూ ఇలా ఊరి పేరును కవితపుర్ పేరు వచ్చేలా మార్చేశారు.

 villagers rename KCR's daughter

ఎంపీ కవిత మాపై చూపిన ఆదరణతో మేం ఎంతో ఆనందానికి గురయ్యామని ఖానాపూర్‌ సర్పంచి మమతా అన్నారు. అందుకే ఆమె పేరును మా గ్రామానికి పెట్టాలని నిర్ణయించుకుంటున్నాం,… ఎస్‌ఆర్‌ఎస్పీ ప్రాజెక్టు ముంపు గ్రామం మాది. ఈ గ్రామానికి కొద్ది కిలోమీటర్ల దూరంలోనే మాకు పునరావాసం కల్పించారు కవిత గారు. మా గ్రామ పునర్నిర్మాణానికి అవసరమైన స్థలం, ఇళ్ల నిర్మాణంలో చొరవ తీసుకున్నారు కవిత. ఖానాపూర్‌ గ్రామ పంచాయితీలో 274 కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని కవిత హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వెల్లడించారు.

- Advertisement -