గ్రేటర్ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి..

155
polling
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.డిసెంబర్ 1న ఉదయం 7గంట‌ల‌ నుండి పోలింగ్ ప్రారంభంకానుండగా సాయంత్రం 6గంట‌ల‌కు పోలింగ్ పూర్తి అవుతుంది. మొత్తం ఓటర్ల సంఖ్య 74,67,256, పురుషులు 38,89,637, స్త్రీలు 30,76,941, ఇతరులు 415 ఉండగా మొత్తం వార్డుల సంఖ్య 150, పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య 1122.

టీఆర్ఎస్‌ తరపున 150,బీజేపీ తరపున 149,కాంగ్రెస్ 146,టీడీపీ 106,ఎంఐఎం 51,సీపీఐ 17,సీపీఎం 12,ఇతర పార్టీల అభ్యర్థులు 76,స్వతంత్రులు 415 మంది బరిలో ఉన్నారు. మొత్తం పోలింగ్ సిబ్బంది 36,404గా ఉండగా డిసెంబర్ 1న ఉ. 5:30గంట‌ల వ‌ర‌కు ఎన్నిక‌ల సిబ్బంది సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉండనుంది. ఉ. 6గంట‌ల‌కు పోలింగ్ ఏజెంట్లు హాజ‌రుకానుండగా ఉదయం 6గంట‌ల నుండి 6:15గంట‌ల మ‌ధ్య మాక్ పోలింగ్ జ‌రుగుతుంది.

కోవిడ్-19 పాజిటివ్ ఉండి పోస్టల్ బ్యాలెట్ పొందలేని ఓటర్లకు ప్రత్యేక లైన్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. ఓట‌రు గుర్తింపు కార్డులేని ఓట‌ర్ల‌కు ఎంపిక చేసిన 21 ఇత‌ర గుర్తింపు కార్డులు ఉన్నా ఓటింగ్ అవ‌కాశం కల్పించనున్నారు. ప్ర‌తి పోలింగ్ స్టేష‌న్‌లో వృద్దులు, విక‌లాంగుల‌కు ప్ర‌త్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కోవిడ్-19 నిబంధనలను అనుసరించి ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ముందు రోజు శానిటైజేషన్ పూర్తి చేయనున్నారు.

- Advertisement -