గ్రేటర్‌లో స్వల్పంగా పెరిగిన పోలింగ్ శాతం..

156
ghmc
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. 150 డివిజన్లకు గాను 149 డివిజన్లలో పోలింగ్ ప్రశాంతంగా ముగియగా మరో డివిజన్‌లో గుర్తులు తారు మారు కావడంతో రీపోలింగ్ రేపు జరగనుంది.

కరోనా మహమ్మారి దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకొని ఎన్నికలను నిర్వహించిన ప్రజలు ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. అయితే గతంతో పోలీస్తే ఓటింగ్ శాతం మాత్రం స్వల్పంగా పెరిగింది.

ఫైనల్ గా జీహెచ్ఎంసి ఎన్నికల్లో 46.60శాతం పోలింగ్ నమోదైంది. యూసఫ్ గూడ డివిజన్ లో అత్యల్పంగా 32.99శాతం పోలింగ్ నమోదు కాగా, కాంచన్ బాగ్ డివిజన్ లో అత్యధికంగా 70.39శాతం పోలింగ్ నమోదైంది.

- Advertisement -