బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 87 హైలైట్స్

190
avinash

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 4 తెలుగు విజయవంతంగా 87 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 87వ ఎపిసోడ్‌లో భాగంగా రేస్ టూ ఫినాలేలో భాగంగా అవినాష్-సొహైల్ మధ్య వాగ్వాదం,తనను ఇంటి నుండి పంపించేయండి అంటూ అవినాష్ ఆవేదన వ్యక్తం చేయడం,రేసు టూ ఫీనాలేలో నలుగురు నిలవడం వంటి వాటితో ఎపిసోడ్ ముగిసింది.

తొలుత మోనాల్,అఖిల్,సోహైల్ మధ్య ఎలిమినేషన్‌ సందర్భంగా చర్చ జరిగింది. ఇక హారిక కూడా అభిజిత్‌కి కాస్త దూరం కావడానికి ప్రయత్నిస్తున్నట్టుగానే అనిపించింది. ఇక సోహైల్-అఖిల్ మధ్య మోనాల్ గురించి చర్చ జరిగింది. నేను స్టార్టింగ్ నుంచి ఆమె వద్దనే చెప్తున్నా.. ఈరోజు నుంచి మోనాల్‌తో మాట్లాడనే మాట్లాడను. నాకు ట్రస్ట్ పోయింది.. ప్రామిస్‌గా చెప్తున్నా.. అలాంటి పర్సన్ నాకు వద్దు అంటూ తెలిపాడు అఖిల్.

ఇంత గొడవ జరిగిన తర్వాత మోనాల్-అఖిల్ ఇద్దరూ కూర్చుని మాట్లాడుకున్నారు. నువ్ అన్న మాటకు నేను ఫీల్ అయ్యా అని అఖిల్ అనడంతో..దండం పెట్టి సారీ చెప్పింది మోనాల్. దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు అఖిల్. నాకు సారీ అక్కర్లేదు మోనాల్ అని చెప్పాడు. ఇక ఇదే విషయాన్ని సోహైల్…అరియానా,అవినాష్ వద్ద ప్రస్తావించగా వాళ్లిద్దరూ మళ్లీ కలుస్తారు నువ్ జోక్యం చేసుకోకు అని సూపర్ మంచి సలహా ఇచ్చింది అరియానా.

ఇక తర్వాత రేస్ టు ఫినాలే‌కి శంఖం పూరించారు బిగ్ బాస్. ఈ రేస్ టు ఫినాలే మెడల్ గెలుచుకున్నవాళ్లకి ఫినాలే ఎంట్రీ ఉంటుందని చెప్పారు. గార్డెన్ ఏరియాలో ఒక ఆవు బొమ్మని పెట్టారు. అలాగే ప్రతి ఇంటి సభ్యుడికి మిల్క్ స్టేషన్ ఇచ్చారు. ఆవు అంబా అని అరిచినప్పుడల్లా.. ఆవుకి ఉన్న ట్యాబ్స్ ద్వారా వచ్చే పాలను ఇంటి సభ్యులు తమకి చెందిన బాటిల్స్‌లో నింపుకోవాల్సి ఉంటుంది. బజర్ మోగిన ప్రతిసారి ఏ సభ్యుడి దగ్గర తక్కువ పాల బాటిల్స్ ఉంటాయో.. ఆ సభ్యుడు టాస్క్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని తెలిపాడు.

బజర్ మోగగానే ఇంటి సభ్యులు ఒకరితో ఒకరు పోటీ పడి పాలు పట్టుకోవడానికి కిందా మీదా పడ్డారు. అఖిల్, సొహైల్, అవినాష్, హారిక డైరెక్ట్‌గా పాల కేన్‌లు తీసుకువెళ్లి ఆవుకింద పెట్టేశారు. అరియానా, మోనాల్‌లకు పాలు పట్టే అవకాశమే లేకుండా పోయింది.ఇక అవినాష్‌ కూడా పాలు పట్టేందుకు పోటీపడగా సోహైల్-అఖిల్‌ వాగ్వాదానికి దిగారు. దీంతో తాను ఈ టాస్క్ నుండి తప్పుకుంటున్నానని తెలిపి తన ఆక్రోశాన్ని తెలిపాడు అవినాష్.

ఇక తొలి రౌండ్‌లో అవినాష్ ఔట్ కాగా తర్వాతి రౌండ్‌లో అరియానా,మోనాల్ గేమ్ నుండి ఔటయ్యారు. అఖిల్, సొహైల్, అభిజిత్, హారికలు లెవల్‌ 2కి నామినేట్ అయ్యారు.