మద్యం,మాంసం ప్రియులకు షాక్

10
- Advertisement -

మందుబాబులు, మద్యం ప్రియులకు షాక్. అక్టోబర్ 2న మద్యం, మాంసం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రకటించారు. అక్టోబర్ 2 దసరా అయినప్పటికి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు, స్లాటర్ హౌస్‌లను మూసివేయాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు.

మహాత్మా గాంధీ జయంతికి మాంసం దుకాణాలు బంద్ చేయాలని జీహెచ్ఎంసీ యాక్ట్ 1955లోని 533B ప్రకారం స్టాండింగ్ కమిటీలో ఆమోదించారని గుర్తుచేశారు. సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులు పర్యవేక్షణ చేపట్టి సరైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా మాంసం షాపులతో పాటు మద్యం షాపులను కూడా మూసివేస్తున్నట్లు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మద్యం, మాంసం ప్రియులు ఆందోళనలో ఉన్నారు.

Also Read:తొందరపడి దసరాకు దావత్‌లు ఇవ్వకండి!

- Advertisement -