మొబైల్ అన్నపూర్ణ పథకం ప్రారంభం

564
Mobile annapurna
- Advertisement -

హైదరాబాద్ లో పేద ప్రజల ఆకలి తీర్చేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఐదు రూపాలయ అన్నపూర్ణ భోజనం పథకాన్ని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ అన్నపూర్ణ భోజనం పథకాన్ని ప్రారంభించి నేటితో ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2014 మర్చి 1న మొదటగా 8సెంటర్లలో ఈ పథకాన్ని ప్రారంభించారు. హరేకృష్ణ మూమెంట్ టారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ పథకం ఇప్పుడు నగర వ్యాప్తంగా 150 కేంద్రాలలో విజయవంతంగా కొనసాగుతుంది.

ఎంతో మంది పేదలకు ఈ అన్నపూర్ణ భోజనం ఉపయోగపడుతుంది. రూ.5కే అన్నపూర్ణ భోజనం పథకాన్ని ప్రారంభించి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు అమీర్ పేటలో అన్నపూర్ణ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, సీఎస్‌ సోమేష్‌ కుమార్‌, పట్టణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి అరవింద్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం మొబైల్‌ అన్నపూర్ణ పథకాన్ని జీహెచ్‌ఎంసీ ప్రారంభించింది.

- Advertisement -