త్వరలోనే రైతు రుణమాఫీ: కేటీఆర్

255
ktr
- Advertisement -

త్వరలోనే రైతు రుణమాఫీ జరుగుతుందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో కొత్తగా ఎన్నికైన డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…టీఆర్ఎస్‌కు ప్రజలు తిరుగులేని విజయాలందిస్తున్నారని తెలిపారు.

టీఆర్‌ఎస్‌ రైతుపక్షపాత ప్రభుత్వం అని… రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఇదన్నారు. రుణమాఫీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలిచ్చారని..రైతులెవరూ రుణమాఫీపై ఆందోళన చెందవద్దన్నారు. రైతాంగ సమస్యలపైన ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల దేశంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో దాని ప్రభావం కొంత తక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలో 906 సంఘాలకు ఎన్నికలు జరిగితే 94 శాతానికిపైగా సంఘాల్లో రైతులు టీఆర్‌ఎస్‌ను గెలిపించారని చెప్పారు.

- Advertisement -