కొత్త ట్రేడ్ లైసెన్స్‌ల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోండి

274
ghmc
- Advertisement -

న‌గ‌ర ప‌రిధిలో ఉన్న ట్రేడ‌ర్లు త‌మ లైసెన్స్‌ల‌ను మార్చి 31వ తేదీలోపు రెన్యువల్ చేసుకోవాలని జిహెచ్‌ఎంసి తెలిపింది. ట్రేడ్ లైసెన్స్‌ల రెన్యువ‌ల్‌లో జాప్యం చేస్తే లైసెన్స్ ఫీజుకు అద‌నంగా అప‌రాద రుసుం విధించ‌బ‌డుతుంద‌ని తెలిపింది. ఇప్పటి వరకు నగరంలో 19,530 మంది ట్రేడర్లు మాత్రమే తమ లైసెన్స్ లను రెన్యువల్ చేసుకున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా కొత్తగా 7,607 మంది ట్రేడర్లు కొత్తగా లైసెన్స్ లను తీసుకున్నారని తెలిపారు.

కాగా ఏప్రిల్ 1వ తేదీ నుండి మే 30వ తేదీ మధ్యలో రెన్యువల్ చేస్తే 25శాతం అపరాద రుసుం, మే 31 నుండి రెన్యువల్ ద‌ర‌ఖాస్తుల‌పై అద‌నంగా 50శాతం అప‌రాద రుసుంగా వ‌సూలు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు ట్రేడ్ లైసెన్స్ లేనివారు కూడా ట్రేడ్ లైసెన్స్ కొర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. ట్రేడ్ లైసెన్స్ పొందకుండా వ్యాపారాలు నిర్వహిస్తే 100శాతం పెనాల్టి విధించడంతో పాటు నెలకు 10శాతం అదనపు పెనాల్టిని విధిస్తామని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో 1,66,165 టిన్ నెంబర్లు ఉన్నాయని, 1,08,605 టిన్ నెంబర్ లేనివిగా ఉన్నాయని వివరించింది.

కొత్తగా ట్రేడ్ లైసెన్స్ లను ఆన్‌లైన్‌లో, ఇ-సేవా కేంద్రాలు, జిహెచ్‌ఎంసి సిటీజ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్లు, జిహెచ్‌ఎంసి ప్ర‌ధాన కార్యాల‌యం, స‌ర్కిల్ కార్యాల‌యాల‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చని జిహెచ్ఎంసి తెలిపింది. ట్రేడ్ లైసెన్స్ రెన్యువ‌ల్‌, కొత్త ట్రేడ్ లైసెన్స్‌లను పొందేందుకై కావాల్సిన స‌మాచారం కొర‌కు జిహెచ్‌ఎంసి వెబ్‌సైట్ www.ghmc.gov.in ను సంప్ర‌దించాల‌ని సూచించారు. ఈ అవ‌కాశాన్నివినియోగించుకోవాల‌ని ట్రేడ‌ర్ల‌కు ఒక ప్రకటనలో జిహెచ్ఎంసి కోరింది.

- Advertisement -