గుడ్ న్యూస్… వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కే జై !

289
work from home
- Advertisement -

కరోనా కారణంగా ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్ హోమ్‌ని ఆఫర్‌ చేశాయి సాఫ్ట్ వేర్ కంపెనీలతో పాటు పలు సంస్థలు. ఏడాదిగా వర్క్‌ ఫ్రమ్ హోమ్ కొనసాగుతుండగా తాజాగా దానిని శాశ్వ‌తంగా కొన‌సాగించాల‌ని భావిస్తున్నాయి పలు కంపెనీలు.

తాజాగా బీసీజీ-జూమ్ నిర్వ‌హించిన సర్వేలో 87 శాతం సంస్థ‌లు శాశ్వ‌త వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ వైపు మొగ్గు చూపాయట. అంతేకాదు క‌రోనా కాలంలో ఇంటి నుంచి ప‌ని చేసే వాళ్ల సంఖ్య మూడు రెట్లు పెరిగిన‌ట్లు ఈ స‌ర్వే స్ప‌ష్టం చేసింది. ఉద్యోగులు కూడా 70 శాతం మంది రిమోట్ వ‌ర్కింగ్‌కు అనుకూలంగా ఓటేశారు. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ కార‌ణంగా కంపెనీల‌కు పెద్ద మొత్తంలో డ‌బ్బు ఆదా అవ‌గా, అటు చాలా మంది త‌మ‌ ఉద్యోగాలు కూడా నిలుపుకున్నారు.

ప్ర‌పంచంలో ఇండియా స‌హా ఆరు దేశాల్లోని ప్ర‌ధాన రంగాల‌పై వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ప్ర‌భావాన్ని ఈ స‌ర్వే అధ్య‌య‌నం చేసింది. ఇండియా, యూఎస్‌, యూకే, జ‌పాన్‌, ఫ్రాన్స్, జ‌ర్మ‌నీల‌లో ఈ స‌ర్వే నిర్వ‌హించారు.

- Advertisement -